అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వం అని ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్ వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదు.పేదల హృదయాలను గెలుచుకున్న వాడు సీఎం జగన్ అని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుంది. బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలి అన్న ఆయన…
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో రెండున్నరేళ్లు ఆపార్టీనే అధికారంలో ఉండనుంది. అయితే వచ్చే ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ ముందుస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలను ముందుగానే తెలుసుకొని అమలు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ముందుగానే ఆపార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం…
ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేశారు. అధికారపార్టీలో చర్చగా మారారు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు. వర్గపోరు మళ్లీ రాజుకుని.. సొంత పార్టీలోనే వైరిపక్షాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారెవరో.. ఆ రగడేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీ భరత్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు మరోసారి చర్చగా మారాయి. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో ఓ ఘటన యువనేతల మధ్య ఉన్న ఆధిపత్య…
తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆసక్తి కర కామెంట్స్ చేశారు… వైసీపీ నేతలు సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం భయపెట్టారని…. అందుకే పరిషత్ ఎన్నికలను టి.డి.పి బాయ్ కాట్ చేసిందని తెలిపారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే టి.డి.పి బలమేంటో చూపిస్తామని… వై.సి.పి ప్రభుత్వ తీరు పై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామని వెల్లడించారు. ఎం.పి.పి. స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని…
తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా…
హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా? మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు…
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు…
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్…
ఏపీ ఫైబర్ నెట్ కేసు దర్యాప్తు లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్ నెట్ తొలి దశలో రూ. 320 కోట్ల టెండర్లలో రూ.. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఎండీ…