‘ముందస్తు’ వస్తే ఎవరి బలం ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
2019 ఎన్నికల్లో మొదలైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీ జెండానే ఎగురుతోంది. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఏదో సంక్షేమ పథకంతో లబ్ధి పొందినట్లే కన్పిస్తోంది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కన్పించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీస పోటీ ఇవ్వలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
Also Read
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
- ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్'గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే టీడీపీ తరుపున పలువురు అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీ మాత్రం తాము వదిలేసిన ఎన్నికల్లో గెలువడం ఒక గెలుపేనా అంటూ విమర్శలు గుప్పిస్తుంది. అయితే అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ కనీస పోటీ ఇవ్వలేదు. ఆ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ ఒక్క తాడిపత్రిలో మినహా ఎక్కడ వైసీపీకి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈక్రమంలోనే టీడీపీ ముందస్తు ఓటమి భయంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
ఈక్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళితే టీడీపీ నుంచి ఎంతమంది నేతలు రెడీగా ఉన్నారనేది మాత్రం అనుమానంగా మారింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈమేరకు గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన పీకేను త్వరలోనే రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రెండేళ్లుగా సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే టాక్ ఏపీలో బలంగా విన్పిస్తుంది.
టీడీపీ మాత్రం గత రెండేళ్లలో ఏ ఎన్నికలోనూ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన దాఖాలాలు లేవు. మరోవైపు పొత్తుల్లేకుండా చంద్రబాబు హయాంలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు అటూ జనసేన కానీ, ఇటూ బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు టీడీపీ చెందిన పారిశ్రామిక వేత్తలు అమరావతి రాజధాని కారణంగా, కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే డబ్బులు ఖర్చు చేసేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇన్ సైడ్ టాక్. అంతేకాకుండా టీడీపీలో కొద్దిరోజులుగా కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళితే నష్టపోయేది టీడీపీయే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- ap
- cm jagan
- elections
- tdp
తాజావార్తలు
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
-
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
-
రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
-
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!