మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు. ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు! చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు…
అమరావతి : అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. హోమ్ మంత్రి మేకతోటి సూచరిత ఫైర్ అయ్యారు. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని… అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నాని తెలిపారు. దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు.…
ఎట్టకేలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజల్ట్ ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అన్ని జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జెడ్పీటీసీ ఛైర్మన్ల పేర్లను సైతం ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది. పదవుల పంపకం విషయంలో…
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు ఇంటి దగ్గర ఘటనపై లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షనేత ఇంటిపైకి ఎమ్మెల్యేను పంపి… సీఎం జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నాడని… దీన్ని బట్టి ఆయన ఎంత వణికిపోతున్నాడోనని లోకేష్ పేర్కొన్నారు. “జగన్ వి గాలి హామీలు అని తేలిపోయాయి. ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. జగన్ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని, ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ,వీళ్లనీ పంపడం ఎందుకు?…
అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి? తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన? తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ…
ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!? ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు! అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే…
ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ధర్మ సంస్థాపన కోసం ఈ యుగం లో జన్మించిన వ్యక్తి మోడీ అని… చెడ్డా వారిని శిక్షించే బాధ్యత మోడీ దేనన్నారు. కోర్టులో మా ప్రభుత్వానికినిన్న రెండు మొట్టికాయలు పడ్డాయని… కనక రాజ్ ను పోలీస్ కంప్లైంట్ ఆథారీటీ చైర్మన్ గా నియామకం, రంగుల విషయములో కోర్టు తప్పుపట్టిందని తెలిపారు. సుప్రీమ్ కోర్ట్, హై కోర్ట్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబాబు తీవ్రంగా స్పందించారు.. కోడెల వర్ధంతి కార్యక్రమంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెన్నకి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందని.. అధికారంకోల్పోయి అవాకులు…
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక ప్రతీఒక్కరికి ఆరోగ్యం గురించిన అవశ్యకత తెలిసొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ప్రజా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఒకేరోజు వెయ్యి అంబులెన్సులను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రికార్డు సృష్టించింది. వెయ్యి రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యాధులన్నింటిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, సామాన్య ప్రజలకు బాసటగా నిలిచింది. ఆఖరికి కరోనా ట్రీట్మెంట్ ను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో…
టీడీపీ నేతల పై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమ కాదు డ్రామా అని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఎప్పుడైనా టీడీపీ ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టిందా అని అడిగారు. జీడి క్వింటాకు 9200 ఇచ్చిన ఘనత వైసీపీదే. వ్యవసాయం అంటే టీడీపీ హయాంలో దండగ, అదే వైయస్ హయాంలో వ్యవసాయం పండగ అని తెలిపారు. రైతులకు నష్టం కలిగిస్తే పుట్టగతులు ఉండవు. పంట సాగులో ఇప్పుడు…