విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్ పుట్టిస్తోందా? ఎమ్మెల్యేల పనితీరుకు హైకమాండ్ గీటురాయి పెట్టిందా? ఈ నివేదికలు కొందరు శాసనసభ్యుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయా? నెగెటివ్ స్కోర్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ నేతలు ఆరా తీస్తున్నారా? వైసీపీ నేతల్లో అంతర్గత సర్వేపై టెన్షన్..! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం కంచుకోటలను బద్ధలు కొట్టింది వైసీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా పిలుచుకునే విశాఖజిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు.. మూడు ఎంపీ స్ధానాలను కైవశం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన ఈ…
బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నిక ఉత్కంఠగా జరుగుతుందని అంతా భావించారు. అయితే అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీకి ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. అయితే వైసీపీ మెజార్టీపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 44వేల ఓట్ల మెజార్టీరాగా దానిని అధిగమించడమే లక్ష్యంగా ఆపార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత…
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డ్రగ్స్ వ్యవహారం నుంచి ఎలా బయట పడేయాలన్న బెరుకు, కంగారు సజ్జల మాటల్లో కనిపించాయి అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. జగనుకు లేని క్యారెక్టర్ని ఎవరుఎలా నాశనంచేస్తారో సజ్జల చెప్పాలి అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ అంతా పారదర్శకంగానే జరుగుతోందని సజ్జల గుర్తించాలి. 28 టన్నుల హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అయితే ముఖ్యమంత్రి, డీజీపీ ఏం లేనట్లే మాట్లాడారు. కనీసం సజ్జలైనా ఈ వ్యవహారంలో తనచిత్తశుధ్దిని పరీక్షించుకోవాలి. ప్రభుత్వ…
బద్వేల్ ఉప ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే రెండు పార్టీలు తాజాగా ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని పార్టీలు బరిలో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓడిపోతామని తెల్సినా సదరు పార్టీలు పోటీకి దిగుతుండడం వెనుక మతలబు ఏంటా? అనే…
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం…
బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఏపీలో ఎవరు మిత్రులు.. ఎవరు శత్రువులు అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వనుంది. బద్వేల్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఒక పార్టీలో బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా మరోపార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతోంది. దీంతో బద్వేల్ రాజకీయం ఒకింత…
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన…
ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ? పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..! విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో…
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ.…
ఏపీలో రాజకీయం రోడ్డెక్కింది. గుంతలు పూడుస్తామని జనసేన.. వర్షాలు తగ్గాక రోడ్లు వేస్తామని అధికార వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే రోడ్లు వేసే టైమ్‌లో జనసేన ఈ ఉద్యమం ఎత్తుకుందా? లేక.. జనసేన గళమెత్తాక రహదారులు వేస్తున్నారా? ఇంతకీ ఎవరి దారి రహదారి? అప్పట్లో సోషల్ మీడియాలో రోడ్లపై జనసేన ఉద్యమం..! ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉప్పు నిప్పుగా రాజకీయ సెగలు రేగుతున్న సమయంలో జనసేన రోడ్ల మరమ్మత్తు ఉద్యమం ఆసక్తికర చర్చగా…