ఏపీలో మరోసారి మినీపోరుకు రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుస ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతోంది. పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీచింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీసం పోటీ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు దాదాపు 80నుంచి 90శాతం స్థానాల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. అయితే అనివార్య కారణాలతో దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి…
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి…
చంద్రబాబు ఒక పగటి వేషగాడు… పిట్టలదొర అని మంత్రి కొడాలి నాని అన్నారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…
ఆయన ఏదో ఈక్వేషన్తో ఈయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు. అంతా బాగానే ఉంది. ఈయనేమో.. నేను అప్పుడు అయన అల్లుడికి అంత నష్టం చేసినా… ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారు అంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకే పరిమితమైన ఆ ‘మా’ గొడవ ఇప్పుడు రాజకీయంగా తమను ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట. మోహన్బాబు కామెంట్స్తో ఇరకాటంలో టీడీపీ..! మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా…
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టీడీపీ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో తప్ప టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. దీంతో ఆపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం క్రమంగా ఆపార్టీ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టగా మరికొంతమంది…
పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి.…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.…
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా?..’ అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ఐటీని తామే ప్రవేశపెట్టమని.. సాంకేతికతకు తామే ఆద్యులమని చెప్పుకునే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నారన్న టాక్ నడుస్తోంది.. సాంకేతిక ప్రవేశపెట్టడం కాదు.. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ వారిపై…