ఏపి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందా ? రెండున్నరేళ్ల ముందే ఎన్నికల పొత్తుల మాట తెరపైకి వస్తోందా? మాజీ మంత్రి పితాని జనసేనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? జనసేనతో ప్రయాణంపై టిడిపిలో ఉన్న మాటే ఆయన చెప్పారా? ఈ చర్చ ఎటువెళుతోంది? దీనిపై బిజెపి ఏమంటోంది? ఏపి లో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, 2024 లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపిలో ప్రస్తుతానికి…
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది.…
నెల్లూరు : రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని… ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో…
మన సినిమాల్లో హీరోలు, విలన్లు ఎలాగైతే ఉంటారో.. పురాణాల్లోనూ దేవతలు, రాక్షసులు ఉండేవారు. వీరికి ఒకరంటే ఒకరు పడదు. ఎవరైనా మంచి పని చేస్తే ఇంకొకరికి అసలు నచ్చదు. దీంతో వీరి మధ్య నిత్యం ఫైట్ సీన్లు జరుగుతూనే ఉంటాయి. పురాణాల్లో అయితే దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధాలు జరిగినప్పుడు త్రిమూర్తులు(బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏదోరకంగా సర్దిచెప్పేవారు. విన్నారా? ఒకే.. లేకుంటే తమ శక్తులతో అంతమొందించి లోకకల్యాణం చేసేవాళ్లు. మన సినిమాల్లోనూ అంతే. హీరో క్యారెక్టర్…
జనసేన పవన్ కళ్యాణ్ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో…
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు ఊతమివ్వడానికి సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27 న భారత్ బంద్కు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి…
ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్ పెట్టిందా? ఆఫీసర్ల చెక్లిస్ట్ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!? ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్ మూడ్లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం…
కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయా? సమన్వయం లేక నాయకులే బజారున పడుతున్నారా? ఆధిపత్యపోరు వైఎస్ విగ్రహాన్ని కూల్చేవరకు వెళ్లిందా? లోకల్ సెగలు.. ఇంకెలాంటి మలుపు తిప్పుతాయో పార్టీ వర్గాలకు బోధపడటం లేదా? ఏ విషయంలో పార్టీ నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది? లెట్స్ వాచ్! కోడుమూరు వైసీపీలో వర్గపోరు సెగలు..! కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్రెడ్డి మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది పరిషత్ ఎన్నికల…
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెరాయిన్ కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బట్ట కాల్చి మీద వేయటం టీడీపీ అలవాటే అని చెప్పిన ఆయన టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రెస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు.…
నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యర్థి వర్గం నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రోజాను రెండుసార్లు కష్టపడి మేము గెలిపించాము. అందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అన్నారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను. నాపై ఆమె గెలవగలదా అని ప్రశ్నించారు. ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకోవడం కాదు. మండలంలో రోజా బలపరిచిన ఒక్క ఎంపీటీసీ మాత్రమే గెలిచారు. మేము…