ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర భారీగా నష్టపోయిందని ఏపీవాసులు ఇప్పటికీ మథనపడుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉండటంతో ఏపీలో ఆపార్టీ పర్వాలేదనిపిస్తోంది. ఇక నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న ఆపార్టీ సంక్షేమ కార్యక్రమాల కంటే అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ…
అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు. ఇక ఏపీలో విద్యుత్…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని కామెంట్ చేశారు జనసేన నేతలు.. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.. సమావేశానికి ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు ఆ తర్వాత సమావేశమయ్యారు.. ఆ మీటింగ్కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన కుప్పం ఇంచార్జి డాక్టర్ వెంకటరమణ తదితరులు హాజరు కాగా.. ఈ…
నందికొట్కూరు వైసీపీ గురించి చెబితే.. అక్కడి నాయకుల కంటే.. వారి మధ్య ఆధిపత్యపోరే ఎక్కువ హైలెట్. ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పు నిప్పులా ఉంటారు. వారే కాదు.. వారి అనుచరులు కూడా అంతే. ఇప్పుడు కొత్త గొడవ ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్..! ఆధిపత్యపోరులో దాడులు.. హత్యాయత్నాలు..! కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య…
గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం…
సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తూనే తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పొత్తులతో వెళుతారా? లేదంటే సోలోగానే ఎన్నికలకు వెళుతారా? అనే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది.…
బద్వేల్ ఉపఎన్నికలో పోటీ.. ఆ రెండు జాతీయపార్టీల మధ్యేనట. ఇదేంటి.. అధికారపార్టీని వదిలేసి.. ఉనికి కూడా లేని ఆ పార్టీల మధ్య పోటీ ఉందంటున్నారు అని అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇంతకీ ఆ పార్టీలు పోటీ పడుతోంది గెలవడానికా…? ఓడిపోడానికా..? పోటీకి సై అని కాలుదువ్వుతున్న బీజేపీ, కాంగ్రెస్..! బద్వేల్ ఉపఎన్నికల బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైదొలిగింది. మరణించిన శాసనసభ్యుల కుటుంబాల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నప్పుడు పోటీ చేయకూడదన్న సాంప్రదాయానికి తమ పార్టీ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి…
కలిసి పనిచేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా ఆ యువ నేతలు ఖాతరు చేయడం లేదా? ఇప్పటికీ ఎడముఖం పెడముఖమేనా? అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా? ఎవరా నాయకులు? ఏమా కథ? కలిసి మీడియా ముందుకు రాలేదు..! రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య రగడపై పది రోజుల క్రితమే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎదుట పంచాయితీ జరిగింది. ఇద్దరినీ కలిసి పనిచేయాలని అధినేత ఆదేశించినట్టు సమాచారం. కానీ.. క్షేత్రస్థాయిలో వర్గాలు ఏకం…
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయవేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలుపు లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పై ప్రత్యేకంగా గురిపెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఏమేరకు మెజార్టీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా…