జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని… బూతులకు వైసీపీనే యూనివర్శిటీ అని చురకలు అంటించారు. టీడీపీ అధినేత అధినేత చంద్రబాబును ఏమైనా అంటే.. ఏపీకే బీపీ వస్తుందని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. చంద్రబాబును.. ప్రతిపక్ష నేతలను.. ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేదని నిలదీశారు.
గిద్దలూరులో ఎమ్మెల్యేని నిలదీసినందుకు దళిత యువకుడ్ని చంపేశారని… ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు నారా లోకేష్. పార్టీ కార్యాలయంపై దాడి చేసి తలలు పగల కొడితే హత్యాయత్నం కేసు పెట్టారని… కానీ సీఐను జాగ్రత్తగా అప్పగిస్తే హత్యాయత్నం కేసా..? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఓపిక ఎక్కువ.. నేను అలా కాదు.. వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టమని… పార్టీ కార్యాలయంపై దాడి కాదు.. దేవాలయంపై దాడి చేశారని వైసీపీ పై మండిపడ్డారు. అధికారులే మఫ్టీలో వచ్చి దేవాలయంపై దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు నారా లోకేష్.