ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోతోంది. వైసీపీలోని రెండు గ్రూపులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌గా ఎవరు ఉన్నా ఓవర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోది. రెండో పక్షం వైరిపక్షంగా మారిపోతోంది. దీంతో కొండేపి వ్యవహారాలు తరచూ వైసీపీ పెద్దలకు తలనొప్పులుగా తయారైంది. ఇప్పుడు ఇంఛార్జ్ మార్పు విషయంలోనూ అదే జరిగింది. మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్‌గా మాదాసి వెంకయ్య ఉన్నారు. 2019 ఎన్నికలకు…
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్లో సాగుతోంది. ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ…
ఏపీ టీడీపీలో మహానాడు ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే ఒక్క సభతో కేడర్ మనసు మారిపోయిందన్న ప్రచారం మొదలైంది. శ్రేణుల్లో దూకుడు చూశాక.. సభా వేదికపై పొత్తుల మాటే వినిపించలేదు. ఇప్పుడు టీడీపీ కేడర్ సైతం కొత్తరాగం అందుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారిపోయింది. మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉంది టీడీపీ. జనసేనాని నేరుగా చెప్పకపోయినా.. టీడీపీకి సానుకూల సంకేతాలు ఇచ్చేలా ప్రకటనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ…
గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ ఒకప్పుడు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు. మధ్యలో నేతల మధ్య విభేదాలతో పార్టీ పట్టుకోల్పోయింది. అయినప్పటికీ అక్కడ టీడీపీకి గట్టి ఓటుబ్యాంకే ఉంది. గతంలో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాకినేని పెదరత్తయ్య వరసగా ఐదుసార్లు గెలిచారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత సైకిల్ జోరు తగ్గింది. కాంగ్రెస్, వైసీపీలు పట్టు సాధించాయి. ప్రస్తుతం మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే పరిస్థితి తాడికొండలోనూ ఉంది.…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు.…
మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం,…
మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు…
సొంత జిల్లా చిత్తూరులో సత్తాచాటాలని కసితో ఉన్నారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. గత ఎన్నికలలో 14 స్దానాలకుగాను 13చోట్ల గెలిచి టిడిపికి షాక్ ఇచ్చింది వైసిపి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని కోలుకోని విధంగా దెబ్బకొట్టింది అధికార పార్టీ. ఇక అప్పటి నుండి సొంత జిల్లాలో పట్టుసాదించాలని సీరియస్‌గానే దృష్టి పెట్టారట చంద్రబాబు. తిరుపతి, చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తీ లాంటి నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న…
కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో ఆంటీముట్టనట్టు ఉంటున్నారట. కర్నూలు ఎంపీగా ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉన్న బుట్టా రేణుక.. కరోనా పూర్తిగా తగ్గిపోయాక కూడా యాక్టివ్‌గా లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న రేణుక.. సీటు ఖరారు చేయాలని వైసీపీ అధిష్టానాన్ని…