సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని పేర్ని నాని సూచించారు.
‘సిట్ ఒక అబద్ధం చెబుతుంది. దాన్ని ప్రచారం చేయాలనే ఆత్రంలో ఒక వర్గం మీడియా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా వైఎస్ జగన్ మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. జగన్‌ను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపన. మిగతా వాళ్లు అయితే మాట వింటారు.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారు. జగన్ మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏహ్యభావం కలుగుతుంది. సిట్ ఏర్పాటు చేయగానే లక్ష కోట్ల అవినీతి అని మొదలు పెట్టారు. మద్యం వ్యాపారంలో ఏదేదో జరిగిందని అభూత కల్పనలు చేస్తున్నారు’ అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
Also Read: Amzath Basha: వైఎస్ జగన్ అంటే మీకు అంత భయం.. మాజీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
‘బెవెరేజెస్ కార్పొరేషన్ వచ్చే సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అమ్మిన ప్రతీ బాటిల్‌కు సంబంధించిన నగదు బ్యాంకులో ఉదయాన్నే జమ చేయాలి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరగకపోయినా నగదు ఒక్క రోజులోనే ఖజానాకు వస్తుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రభుత్వ షాపులు నడిపారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆన్‌లైన్ చేయలేదు.. నగదు లావాదేవీలు మాత్రమే చేశారు. వాసుదేవ రెడ్డి కీలకం అని మాట్లాడారు. ఇవాళ దొరికిన 11 కోట్ల నగదు 2024 జూన్‌లో రాజ్ కేసిరెడ్డి దాచుకున్నాడని చెబుతున్నారు’ అని వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.