అరుణాచలంలో తెలంగాణ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. భక్తుడి వెంట ఉన్న నగదు కొసమే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయోజకుడు అయ్యాడు... కొడుకుకు పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.
యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్. సీఎం టూర్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్…
Komatireddy Rajgopal Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భువనగిరి పార్లమెంటు స్థానం విజయంలో కీలక పాత్ర వహించానని, తాను ప్రచార బాధ్యతలు చేపట్టినద్వారా కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. తాజాగా నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ అలజడి రేగింది. చిట్యాల (మం) గుండ్రాంపల్లి వద్ద గల కోళ్ళ ఫారంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కోళ్ళ ఫారంలో…
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
New Born Baby: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుప్రతికి వచ్చిన ఓ యువతికి తోకతో మగ శిశువు జన్మించాడు. అయితే ఆపరేషన్ చేసేప్పుడు శిశువుకు తోక కనపించడంతో డాక్టర్లు షాక్ తిన్నారు. శిశువుకు సుమారు 15 సెంటీమీటర్ల పొడవు తోక కనిపించడంతో ఆశ్చరానికి గురైన వైద్యులు అతి కష్టం మీద శిశువును బయటకు తీశారు. ఇంతటి అపురూపమైన శిశువు జన్మించడంతో ఆస్పత్రి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. Read also: Guntur…
Pet Dog Bite: కుక్కకాటును నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. తనను కరిచింది పెంపుడు కుక్క కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ జిల్లాలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి, ఉప్పల వినయ్ రెడ్డి మృతి చెందారు.
Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో ఉన్న ఎస్‌వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.
యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు. అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి…