Komatireddy Rajgopal Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భువనగిరి పార్లమెంటు స్థానం విజయంలో కీలక పాత్ర వహించానని, తాను ప్రచార బాధ్యతలు చేపట్టినద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పారు. “భువనగిరి సీట్ బీజేపీకి వచ్చేదని సర్వేలు స్పష్టంగా సూచించాయి. కానీ నేను ప్రచారంలో మళ్లీ ఫలితాన్ని తారుమారు చేయగలిగాను,” అని ఆయన అన్నారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్రను గుర్తు చేశారు. “ఆదిశ్టానం నాకు మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా స్వీకరిస్తాను. యాదాద్రి జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను,” అని తెలిపారు.
అలాగే, తాను ఎప్పుడూ మంత్రి పదవిని కోరలేదని, అడగలేదని స్పష్టం చేశారు. “భారత క్రికెట్ జట్టులో ఇద్దరు అన్నదమ్ములు ఆడిన సందర్భాలు ఉన్నాయే గానీ, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఉంటే తప్పేంటి?” అని ప్రశ్నించారు.
తనపై ఉన్న నమ్మకంతోనే మంత్రి పదవి లేని తనకే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌కి ప్రచార బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. “గత ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇన్‌ఛార్జీగా పెట్టారు. నేను మంత్రి పదవిలో లేకపోయినా, భువనగిరి బాధ్యత నాకు ఇవ్వడం వింత కాదా? ఇదే నా సామర్థ్యానికి నిదర్శనం,” అని అన్నారు. రాజకీయాల్లో సామర్థ్యం కీలకమని, అలాగే నాయకుల కృషి పట్ల గుర్తింపు కూడా ఉండాలని సూచించారు. “సమర్థత ఉన్నవారికి పదవులు ఇవ్వాలి,” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ పేపర్‌లో విద్యార్థినీ సమాధానం వైరల్