అరుణాచలంలో తెలంగాణ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. భక్తుడి వెంట ఉన్న నగదు కొసమే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయోజకుడు అయ్యాడు… కొడుకుకు పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం ఇందిరానగర్‌కు చెందిన చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న రవీందర్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు, వీరి కుటంబం హైదరాబాద్‌లో ఉంటుంది. కుమారుడు విద్యాసాగర్ కూడా మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 6న అరుణాచలంకు బయలుదేరిన విద్యాసాగర్ 7న అక్కడకు చేరుకున్నారు. 8వ తేదీ తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాడు..
READ MORE: Aa Gang Repu 3: ఆసక్తి రేపుతున్న ‘ఆ గ్యాంగ్ రేపు 3’!
గిరిప్రదిక్షిణ ప్రారంభమైన కొద్దిసేపటికే బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతడిని ఢీ కొట్టారు. దీంతో కిందపడిపోయిన విద్యాసాగర్‌కు గాయాలు అయ్యాయి. తనను ఢీ కొట్టిన యువకులతో విద్యాసాగర్ వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఘర్షణ సమయంలో ఇద్దరు దుండగులు తమ వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌లతో గొంతుపై కొశారని.. పలుచోట్ల గాట్లుపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ అక్కడే పడిపోగా.. ఉదయం సమయంలో వాకింగ్‌కు వచ్చే వాళ్లు, స్దానిక మున్సిపల్ సిబ్బంది గమనించి… స్దానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో కొనఊపిరితో ఉండగా.. వైద్యం అందిస్తుండగానే విద్యాసాగర్ చనిపోయినట్లు తెలుస్తోంది.
READ MORE: Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
విద్యాసాగర్‌ను ఆసుపత్రికి తరలించిన తరువాత అక్కడి పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దుండగుల చేతిలో గాయపడిన చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడని తెలిపారు. తన కొడుకు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు యువకుడి తండ్రి. విద్యాసాగర్ ఎప్పుడైనా తన స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లేవాడని.. ఈ సారి మాత్రం వాళ్ల స్నేహితులు రానని చెప్పడంతో తన కొడుకు ఒక్కడే వెళ్లాడని… శివయ్య దర్శనం చేసుకుని వస్తాడు అనుకంటే శివైక్యం చెందాడని తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు.. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యాసాగర్‍పై దాడికి పాల్పడింది తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్‌గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.