Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో ఉన్న ఎస్‌వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడుతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సాల్వెంట్ రీసైక్లింగ్ చేస్తున్న సమయంలో ఈ రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Read Also: Bandi Sanjay: అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్లు కూల్చేస్తాం
సమీప గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. దగ్గు వాంతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రియాక్టర్ నుంచి వెలువడిన విషవాయువుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Also: CM KCR: ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?