ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మూడు నెలల చిన్నారికి వ్యాక్సిన్ వేసిన 24 గంటల తర్వాత మరణించినట్లు ఆరోగ్య అధికారి శుక్రవారం తెలిపారు.
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.
మంకీపాక్స్ వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది.
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసుతో ఢిల్లీలో కేసుల సంఖ్య 5కు చేరింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడంతో మంకీపాక్స్ నిర్ధారణైంది.
చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటివి మంకీపాక్స్, చికెన్‌పాక్స్ రెండింటిలో సాధారణ లక్షణాలు కావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు సోకింది ఏ వైరస్ అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు వైరల్ వ్యాధుల లక్షణాలు రోగులలో వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్పెయిన్‌లో మంకీపాక్స్ కారణంగా తొలి మరణం సంభవించిన 24 గంటల్లోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. యూరప్‌లోనే ఇది రెండవ మరణంగా నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీపాక్స్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు.
అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.