Monkeypox: కలవరపెడుతున్న మంకీపాక్స్.. 24 గంటల్లో స్పెయిన్‌లో రెండో మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. ఇప్పటికే 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే వీటి తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరోపియన్ దేశాల్లో కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. యూరోపియన్ దేశాల్లో 70 శాతం కేసులు ఉన్నాయి. అమెరికాలో 25 శాతం కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండిాయాలో కూడా మంకీపాక్స్ అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో నలుగురికి మంకీపాక్స్ సోకింది.
స్పెయిన్‌లో మంకీపాక్స్ కారణంగా తొలి మరణం సంభవించిన 24 గంటల్లోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. యూరప్‌లోనే ఇది రెండవ మరణంగా నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీపాక్స్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం స్పెయిన్‌లో 3750 మంది మంకీపాక్స్ బాధితుల్లో 120 మంది చికిత్స పొందుతుండగా.. ఒకరు మరణించారు. ఆఫ్రికా ఖండం వెలువల సంభవించిన మూడో మరణంగా దీన్ని చెప్పవచ్చు. అంతకుముందు బ్రెజిల్‌లో మంకీపాక్స్‌తో ఓ వ్యక్తి మరణించాడు.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
Monkeypox: స్పెయిన్ లో తొలి మంకీపాక్స్ మరణం.. యూరప్ లోనే మొదటి మరణం
ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రకారం, చాలా ఇన్ఫెక్షన్లు ఐరోపాలో ఉన్నాయి. ఇక్కడ మే ప్రారంభం నుండి 70 శాతం కొత్త కేసులు కనుగొనబడ్డాయి. యూరప్‌లో బెల్జియం, స్పెయిన్‌లో జరిగిన రెండు రేవ్ పార్టీలే వివిధ దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించడానికి కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ పార్టీ తరువాత నుంచే యూరోపియన్ దేశాల్లో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇదిలా ఉంటే యూరప్ దేశాలతో పాటు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురిలో మంకీపాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!