Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Monkeypox Vs Chickenpox Key Differences According To Doctors

Monkeypox: మంకీపాక్స్‌ వర్సెస్ చికెన్‌పాక్స్.. తేడాలేంటీ.. వైద్యులేమంటున్నారంటే?

Published Date :August 1, 2022 , 9:44 am
By Mahesh Jakki
Monkeypox: మంకీపాక్స్‌ వర్సెస్ చికెన్‌పాక్స్.. తేడాలేంటీ.. వైద్యులేమంటున్నారంటే?
  • Follow Us :

Monkeypox: చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటివి మంకీపాక్స్, చికెన్‌పాక్స్ రెండింటిలో సాధారణ లక్షణాలు కావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు సోకింది ఏ వైరస్ అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు వైరల్ వ్యాధుల లక్షణాలు రోగులలో వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉందని వైద్యులు వెల్లడించారు. సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు వైద్యులను సంప్రదించాలని కూడా సూచించారు.

మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్) మశూచి రోగులలో గతంలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది, అయితే ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. వర్షాకాలంలో, ప్రజలు వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు ఎక్కువగా గురవుతారు. ఈ సమయంలో చికెన్‌పాక్స్ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి, ఇవి ఇతర ఇన్‌ఫెక్షన్‌లతో పాటు దద్దుర్లు, వికారం వంటి లక్షణాలను కూడా చూపుతాయని మెదాంటా హాస్పిటల్ విజిటింగ్ కన్సల్టెంట్, డెర్మటాలజీ డాక్టర్ రమణ్‌జిత్ సింగ్ తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా, కొంతమంది రోగులు తికమక పడుతున్నారని.. మంకీపాక్స్, చికెన్‌పాక్స్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని డాక్టర్ రమణ్‌జిత్‌ సింగ్ వెల్లడించారు. తమకు మంకీపాక్స్ ఉందా లేదా అనేది లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇంకా వివరిస్తూ మంకీపాక్స్ సాధారణంగా జ్వరం, అస్వస్థత, తలనొప్పి, కొన్నిసార్లు గొంతు నొప్పి, దగ్గు, శోషరస కణుపుల వాపుతో మొదలవుతుందని, ఈ లక్షణాలన్నీ చర్మ గాయాలు, దద్దుర్లు, ఇతర సమస్యలకు నాలుగు రోజుల ముందు కనిపిస్తాయి. కళ్లు, మొత్తం శరీరానికి వ్యాపిస్తాయన్నారు. మంకీపాక్స్ విషయంలో చర్మమే కాకుండా ఇతర లక్షణాలు కూడా ఉన్నాయన్నారు. అయితే ఏవైనా సందేహాలను తొలగించుకోవడం కోసం వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిదన్నారు. ఇటీవల బయటపడిన రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులు చికెన్‌పాక్స్‌గా మారాయి.

గత వారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో మంకీపాక్స్ పరీక్ష కోసం చేరారు. ఈ నేపథ్యంలో వైద్యులు పరీక్షించగా ఆ వ్యక్తి చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవల బెంగళూరులో ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని పరీక్షించగా.. అతనికి చికెన్‌పాక్స్ ఉందని నిర్ధారణైంది. భారతదేశంలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మూడు కేసులు, ఢిల్లీలో ఒక మంకీపాక్స్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఆదివారం మంకీపాక్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో 22 ఏళ్ల యువకుడు మరణించిన సంగతి తెలిసిందే.

మంకీపాక్స్ వ్యాధిలో చికెన్‌పాక్స్ కంటే పెద్దగా గాయాలు ఉంటాయని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కౌల్ వెల్లడించారు. మంకీపాక్స్‌లో అరచేతులు, అరికాళ్లపై గాయాలు కనిపిస్తాయన్నారు. చికున్‌పాక్స్‌లో గాయాలు చర్మంపై నీటి బొబ్బలు లేదా పొక్కుల్లా ఏర్పడి దురదగా ఉంటాయన్నారు. మంకీపాక్స్‌లో జ్వరం ఎక్కువ కాలం ఉంటుందని.. అలాంటి రోగికి శోషరస గ్రంథులు పెరిగాయని డాక్టర్ సతీష్ కౌల్ చెప్పారు.

చికెన్‌పాక్స్‌కు కారణమయ్యే వైరస్ గురించి బాత్రా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌సీ ఎల్ గుప్తా వివరించారు. చికెన్‌పాక్స్ అనేది రిబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ) వైరస్ అని, ఇది అంత తీవ్రంగా ఉండదన్నారు. అయితే ఇది చర్మంపై దద్దుర్లు కూడా కలిగిస్తుందన్నారు. ఇది చికెన్‌పాక్స్ సీజన్ అని తెలిపిన ఆయన సాధారణంగా, వర్షాకాలంలో ఈ తేమ, ఉష్ణోగ్రత పెరుగుదల, నీరు నిలిచిపోవడం, తేమ, తడి బట్టలు ఇవన్నీ వైరస్ పెరుగుదలకు దారితీస్తాయన్నారు. అలాగే, ఈ వ్యాధికి సంబంధించిన మతపరమైన అంశం ఉంది. ప్రజలు దీనిని ‘దేవత’ లాగా చూస్తారు కాబట్టి అలాంటి రోగులకు ఎలాంటి మందులతో చికిత్స చేయరని కూడా వెల్లడించారు. వారిని ఒంటరిగా ఉంచి నయం చేయడానికి సమయం ఇస్తారని ఆయన చెప్పారు. మంకీపాక్స్ గురించి మాట్లాడుతూ, ఈ వైరస్‌ జంతువుల ద్వారా సోకుతుందని.. అయితే గొంతు నొప్పి, జ్వరం, సాధారణ వైరస్ సంకేతాలతో మొదటగా వైరస్ వ్యాప్తి జరుగుతుందన్నారు.

“ఈ వైరస్ యొక్క ప్రధాన సంకేతం శరీరం లోపల ద్రవాలు కలిగి ఉన్న దద్దుర్లు. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది, ఇది శరీర నిరోధకతను బలహీనపరుస్తుంది. కానీ దాని సంక్లిష్టత వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురై పొక్కులు వస్తాయి. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాధి ప్రారంభదశలో ఉంది. మేము కేవలం ఐసోలేషన్ పద్ధతిని అనుసరిస్తున్నాము. అనుమానిత రోగికి వారి లక్షణాల ప్రకారం చికిత్స చేస్తున్నాము. గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే మనం సాధారణంగా తీసుకునే జెనరిక్ మందులనే వాడతాం.” ఆయన వెల్లడించారు. గతంసో చికెన్‌పాక్స్ ఇన్‌ఫెక్షన్ ఉన్న రోగి మంకీపాక్స్‌కు గురవుతాడా లేదా అనే ప్రశ్నలను కూడా వైద్యులు స్వీకరించారు. కానీ దీనికి సమాధానం లేదు.

Monkeypox: కేరళలో మంకీపాక్స్‌తో 22 ఏళ్ల వ్యక్తి మృతి.. దేశంలో తొలి మరణం

చికెన్‌పాక్స్, మంకీపాక్స్‌లు రెండూ వేర్వేరు వైరస్‌ల వల్ల సంభవిస్తాయని ఢిల్లీలోని బీఎల్‌కే మ్యాక్స్ ఆస్పతిలోని సీనియర్ డాక్టర్ రాజిందర్ కుమార్ తెలిపారు. ప్రసార విధానం భిన్నంగా ఉంటుందన్నారు. కానీ మశూచి వ్యాక్సినేషన్ పొందిన వారికి మంకీపాక్స్ వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.
“1979-80లో వ్యాధి పూర్తిగా నిర్మూలించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) చెప్పిన తర్వాత స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ నిలిపివేయబడింది. 1980 కంటే ముందు జన్మించిన వారిలో మశూచి వ్యాక్సిన్ తీసుకున్న వారికి మంకీపాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మశూచి, మంకీపాక్స్ వ్యాధులు రెండూ ఒకే కుటుంబానికి చెందిన వైరస్‌ల వల్ల వస్తాయి.” అని డాక్టర్ రాజిందర్ కుమార్ సింఘాల్ తెలిపారు.

  • Tags
  • Chickenpox
  • chickenpox symptpoms
  • chickenpox vs monkeypox
  • monkeypox
  • monkeypox guidelines

WEB STORIES

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

RELATED ARTICLES

Cough Syrups: ఉజ్బెకిస్తాన్‌లో ఈ భారతీయ దగ్గు సిరప్‌లను ఉపయోగించొద్దు.. డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు

Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి

Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?

Monkeypox: గ్లోబల్ ఎమర్జెన్సీగానే మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే..

తాజావార్తలు

  • Cardamom : యాలకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

  • Eknath Shinde: రాహుల్ గాంధీ అండమాన్ జైల్లో ఉండాలి.. సావర్కర్ వ్యాఖ్యలపై ఏకనాథ్ షిండే ధ్వజం

  • MLA Ramesh Babu: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయిన పడవలు.. ఎమ్మెల్యే ఎద్దేవా

  • Manda Krishna Madiga: కడప పోలీసుల నిరక్ష్యం వల్లే అది జరిగింది

  • Dokka Manikyavara Prasad: ఓటుకు కోట్లు ఆఫర్ చేసినవారిపై కేసులు పెట్టాలి

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions