సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్‌తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ గెలుపొందింది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘోర ఓటమిని చవిచూసింది.
ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భాగంగా.. నవంబర్ 13న సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియాను సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్�
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 37-41 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది.
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక�
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 44-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఈ సీజన్ తన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది.