Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్…
Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.
Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్‌లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్‌గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. మహిళలు వంటిళ్లకే పరిమితమయ్యారు. చివరకు బాలికల విద్యను కూడా తాలిబాన్లు నిషేధించారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతికి వచ్చినప్పటి నుంచి అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు అక్కడ విలువ లేకుండా పోయింది.
Iran: ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు.
Topless At Public Swimming: లింగవివక్షతను రూపుమాపేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా టాప్‌లెస్‌గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ లోని ప్రవేశించడాన్ని అనుమతించింది. దీంతో ఇకపై మగవారు, ఆడవారు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టవచ్చన్నమాట. మహిళ వివక్షపై ఓ మహిళ ఫిర్యాదు ఇవ్వడంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు. ఇదిలా…