Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ప్రతిభా భారతిని మొదటి మహిళా స్పీకర్ ను చేసింది చంద్రబాబు అన్నారు. ఇక, విద్యార్ధులలో సైతం ఆడపిల్లలే మొదటి స్థానంలో ఉన్నారు.. 85 శాతం ఉత్తమ విద్యార్ధులు ఆడపిల్లలే.. 3600 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చాం.. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Andhra pradesh : నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
అయితే, 1992లో హెరిటేజ్ సంస్థను మా నాన్న ప్రారంభించి మా అమ్మకు అప్పజెప్పారు.. ఇవాళ రూ. 5 వేల కోట్ల విలువైన కంపెనీ మా అమ్మ నడిపిస్తోంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక, నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళా భద్రత ఉండాలంటే వారిని గౌరవించాలి.. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు భారం తగ్గుతుంది.. నెలకు కనీసం రూ. 1500 భారం తగ్గుతుందన్నారు. ధన దాహం కోసం గత ఐదేళ్ళు విషంతో సమానమైన మద్యం ఇచ్చి మహిళల తాళిబొట్లు తెంపారు.. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు.. ముందు ఇంట్లోని తల్లి చెల్లికి న్యాయం చేసి మా గురించి ఆలోచించాలని హెచ్చరిస్తున్నాను.. పరిశ్రమలు గత ఐదేళ్ళలో పక్క రాష్ట్రాలకు తరలించారు మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
Read Also: Massive Cloudburst: స్వాతంత్ర్య దినోత్సవం వేళ మృత్యుఘోష.. 65కు చేరిన మృతుల సంఖ్య..
ఇక, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్లతో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని మంత్రి లోకేష్ తెలిపారు. మిస్సైల్ మోడీ ఆపరేషన్ సింధూర్ తో తగిన గుణపాఠం చెప్పారు.. మురళీ నాయక్ ను కోల్పోయాం.. మురళీ నాయక్ తన కుంటుంబానికి భారతదేశం అండగా ఉంటుందన్నారు. అయితే, సినిమాలు, వెబ్ సిరీస్ లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఉంటే తీసి వేయ్యాలి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.