Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Trump The Peace President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ అతడ్ని ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది.
అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్‌తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. రెండు దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా, రేర్-ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో, ఇటీవల వైట్ హౌజ్‌లో…
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమావేశం అయ్యారు. దాదాపుగా 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ఓవల్ కార్యాలయంలో షరీఫ్, మునీర్‌తో ట్రంప్ రహస్య చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. దిగ్గజ సీఈవోలందరూ విందుకు హాజరయ్యారు. కానీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హాజరుకాకపోవడంపై అంతర్జాతీయంగా వార్త చక్కర్లు కొట్టింది.
వైట్‌హౌస్ వేదికగా దిగ్గజ టెక్ సీఈవోలందరికీ ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. విందులో ట్రంప్ దంపతులిద్దరూ హాజరయ్యారు. విందులో సీఈవోలతో ట్రంప్ ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషించారు. సొంత దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.