వెనిజులా సంక్షోభం తర్వాత వైట్‌హౌస్‌లో కీలక సమావేశం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్‌ను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కలిశారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేశారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా, మెక్సికోకు హెచ్చరికలు జారీ చేశారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని.. పెట్రో కొకైన్ అమ్ముతోందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వైట్‌హౌస్‌లో తళుక్కున మెరిసింది. శ్వేతసౌదంలో ట్రంప్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మల్లికా షెరావత్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో పంచుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాను ఎవరు పరిపాలించినా అధ్యక్షుల ఫొటోలు వైట్‌హౌస్‌లో ఉంటాయి. డెమొక్రాటిక్ నేతలైనా.. రిపబ్లికన్ నేతలైనా వారి చిత్రపటాలు శ్వేతసౌధంలో ఉంచుతారు. కొత్తగా ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్.. ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వైట్‌హౌస్ హాలిడే పార్టీలో ఈ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది.
అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే వైట్‌హౌస్ దగ్గర ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్‌హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చాలా రోజుల తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ సౌదీ యువరాజుకు ఇచ్చిన ప్రత్యేక విందులో మస్క్ దర్శనమిచ్చారు. అధ్యక్షుడితో వైరం తర్వాత మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షం కావడంతో వార్త హల్‌చల్ చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య నిన్నామొన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ముందు ఓ రేంజ్‌లో ట్రంప్ విరుచుకుపడ్డారు. మమ్దానీని నోటికొచ్చినట్లు మాట్లాడారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.