Trump The Peace President: ట్రంప్‌కు ‘ది పీస్ ప్రెసిడెంట్’ బిరుదునిచ్చిన వైట్‌హౌస్.. జోకులు వేసుకుంటున్న ప్రపంచ దేశాలు!
- నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు..
- ఇప్పటి వరకు 7 యుద్ధాలను ఆపాను అని తెలిపిన అమెరికా అధినేత..
- డొనాల్డ్ ట్రంప్ ను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొన్న వైట్‌హౌస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump The Peace President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ అతడ్ని ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తుంది. శాంతి బహుమతిని ఇంకా ప్రకటించలేదు. కాగా, నోబెల్ శాంతి బహుమతి శుక్రవారం నాడు ప్రకటించాల్సి ఉంది. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా క్వశ్చన్ చేయగా.. ఈ సందర్బంగా అతడు స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను ఆపేశాను.. ఎనిమిదో యుద్ధాన్ని(ఉక్రెయిన్, రష్యా) పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నామని తెలియజేశాడు. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటాం.. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలను ఆపలేదని చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేశాయి.. కానీ, నోబెల్ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. అడ్డుకుంటుందని విమర్శలు గుప్పించారు.
Read Also: KTR Hhouse Arrest: హరీష్‌రావు, కేటీఆర్ హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
కాగా, డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్..‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. జూన్ 20వ తేదీన, ఇస్లామాబాద్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ దౌత్య జోక్యంతో ఆగిపోయిందని పాక్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ ను .‘ది పీస్ ప్రెసిడెంట్’ అనే శీర్షికతో శ్వేతసాధం చేసిన ట్వీట్ పై ప్రపంచదేశాలు జోకులు వేసుకుంటున్నాయి. పలు దేశాలను బెదిరించి వారితో నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయించుకున్న ట్రంప్.. .‘ది పీస్ ప్రెసిడెంట్’ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నాయి.
THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd
— The White House (@WhiteHouse) October 9, 2025
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!