Trump: ట్రంప్‌తో షరీఫ్, మునీర్ 90 నిమిషాలు రహస్య చర్చలు.. వాటిపైనే చర్చ!?
- ట్రంప్‌తో షరీఫ్, మునీర్ 90 నిమిషాలు రహస్య చర్చలు
- ఆహ్లాదకరంగా జరిగిందని పాక్ పీఎంవో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమావేశం అయ్యారు. దాదాపుగా 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యంత ముఖ్యమైన అంశాలు, భద్రతపై దృష్టి పెట్టినట్లుగా పేర్కొంది. ఇక ట్రంప్‌తో షరీఫ్ సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Bihar: ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఆప్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. అయితే బాగ్రామ్ వైమానిక స్థావరం స్వాధీనం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ సహకారాన్ని ట్రంప్ కోరినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరగడంతో బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అమెరికాకు పాకిస్థాన్ సహకరిస్తే మాత్రం శత్రువుగా చూడాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు. అంతేకాకుండా సరిహద్దులో ఆప్ఘనిస్థాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయంలో అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Modi-Putin: మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇక జో బైడెన్ హయాంలో నిలిపివేయబడిన అమెరికా-పాకిస్థాన్ సైనిక శిక్షణ, మార్పిడి కార్యక్రమాలను పునరుద్ధరించాలని అసిమ్ మునీర్.. ట్రంప్‌ను కోరారు. మునీర్ అభ్యర్థనకు ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తిరిగి ప్రవేశపెట్టేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఉగ్రవాద నిరోధక కమాండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ నుంచి ఎదురయ్యే సీమాంతర ఉగ్రవాదం, బలూచిస్థాన్‌లో అశాంతి, కాశ్మీర్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని షరీఫ్, మునీర్‌కు ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!