పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ఓవల్ కార్యాలయంలో షరీఫ్, మునీర్‌తో ట్రంప్ రహస్య చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముందే షరీఫ్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. వెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవెన్యూ ప్రవేశ ద్వారం దగ్గర సీనియర్ పరిపాలన అధికారులు స్వాగతం పలికారు. షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఉన్నారు. ఇక షరీఫ్ ఓవల్ కార్యాలయానికి రావడం ఇదే మొదటిసారి. 2019లో ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ వైట్‌హౌస్‌కు వెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత షరీఫ్ వెళ్లడం ఇది చారిత్రాత్మక విషయమే. ఇక ఆ మధ్య మునీర్.. ఆర్మీ చీఫ్‌గా వైట్‌హౌస్‌కు వెళ్లి ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇక సమావేశానికి ముందు ఇద్దరు నాయకులను ‘‘గొప్ప నాయకులు’’ అంటూ ట్రంప్ ప్రశంసించడం విశేషం.

పైకి ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు చెబుతున్నా.. లోపల మాత్రం రహస్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య పాకిస్థాన్‌తో ట్రంప్ సంబంధాలు బలపర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయంలోకి మీడియాను అనుమతించకుండా షరీఫ్, మునీర్‌తో ట్రంప్ కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. సమావేశంలో ఏం చర్చించారో ఇప్పటి వరకు బయటకు రాలేదు.
ఇది కూడా చదవండి: Trump: సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్‌కు భారీ ఎఫెక్ట్