Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!
- బలపడుతున్న అమెరికా-పాకిస్థాన్ బంధం
- అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!
- ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రత్యేక కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ప్రపంచ నాయకుడు ట్రంప్ అంటూ షెహబాజ్ షరీఫ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను అసిమ్ మునీర్ నామినేట్ చేశాడు. ఇక పాకిస్థాన్‌పై తక్కువ సుంకం విధించి.. భారత్‌పై మాత్రం ట్రంప్ భారీగా సుంకం విధించారు. దీంతో అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు
Also Read
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
ఇక తాజాగా అమెరికాలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ భావిస్తున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ మంగళవారం ఒక కథనంలో పేర్కొంది. అమెరికా నుంచి అధునాతన ఎయిర్ టు ఎయిర్ AIM-120 క్షిపణులను కొనుగోలు చేసే అవకాశం ఉందని కథనంలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Diwali: దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు
గతంలో రక్షణ శాఖగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ (DoW) ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో AIM-120 క్షిపణులను అందుకున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపింది. దీంతో అమెరికా నుంచి AIM-120 అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) పొందే అవకాశం ఉందని సమాచారం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తోందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ స్పష్టం చేసింది.
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్, యూకే, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి. ఈ ఆర్డర్‌కు సంబంధించిన పని మే 2030 చివరి నాటికి పూర్తి అవుతుంది. ‘‘ఈ ఒప్పందంలో యూకే, పోలాండ్, పాకిస్థాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఒమన్, కొరియా, గ్రీస్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, సింగపూర్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, జపాన్, స్లోవేకియా, డెన్మార్క్, కెనడా, బెల్జియం, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇటలీ, నార్వే, స్పెయిన్, కువైట్, ఫిన్లాండ్, స్వీడన్, తైవాన్, లిథువేనియా, ఇజ్రాయెల్, బల్గేరియా, హంగేరీ, టర్కీలకు విదేశీ సైనిక అమ్మకాలు ఉంటాయి’’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. శత్రువుపై రెండు దేశాలు పోరాటం చేయాలని ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే భారత్ ప్రకటించింది. తాజాగా అమెరికా దగ్గర నుంచి పాకిస్థాన్ అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!