బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వైట్‌హౌస్‌లో తళుక్కున మెరిసింది. శ్వేతసౌదంలో ట్రంప్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మల్లికా షెరావత్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇది కూడా చదవండి: Modi-Priyanka Gandhi: మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ.. అసలేం జరిగిందంటే..!
వాషింగ్టన్ డీసీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్షిక వేడుక జరుగుతుంటుంది. వైట్‌హౌస్‌లో ట్రంప్ నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు. ఈసారి భారతీయ హీరోయిన్ మల్లికా షెరావత్ వైట్‌హౌస్‌లో కనిపించింది. కేవలం పరిమిత అతిథులకే ఆహ్వానాలు ఉంటాయి. అలాంటి ఉన్నత స్థాయి విందుకు మల్లికా షెరావత్ హాజరు కావడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఎవరూ ఆహ్వానం పంపారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్
మల్లికా షెరావత్ పోస్ట్ చేసిన ఫొటోల్లో వైట్‌హౌస్ ప్రవేశ ద్వారం దగ్గర పోజులిచ్చినట్లు కనిపించింది. పింక్-ఓంబ్రే స్లిప్ డ్రెస్‌ను ఎంచుకుంది. ఇక విందులో అతిథులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తుండగా ఆ సందర్భంలో కూడా సెల్ఫీ ఫొటో దిగింది. ఇక వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను కూడా మల్లికా షెరావత్ పంచుకుంది. చాలా ఉల్లాసంగా ఆమె కనిపించింది. ఇక సోషల్ మీడియాలో ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ‘‘వైట్ హౌస్ క్రిస్మస్ విందుకు ఆహ్వానించబడటం పూర్తిగా అవాస్తవంగా అనిపిస్తుంది.. కృతజ్ఞతతో.’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అభిమానులను ఆకట్టుకుంది. ‘‘అభినందనలు! మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? నాకు ఆసక్తిగా ఉంది.’’ అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. మీరు ఎక్కడికైనా వెళ్లున్నారని.. చాలా సంతోషంగా ఉందంటూ మరొకరు కామెంట్ చేశారు.
వైట్ హౌస్ క్రిస్మస్ విందు అనేది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ప్రతి డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు, కుటుంబం దీనిని నిర్వహిస్తుంటారు. అంగరంగ వైభవంగా అలంకరిస్తుంటారు. సిబ్బంది సభ్యులు, ప్రముఖులు, ఎంపిక చేసిన అతిథులు పాల్గొంటారు.