US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!
- వైట్‌హౌస్ దగ్గర కాల్పులు
- ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!
- నిందితుడిపై ట్రంప్ ఆగ్రహం.. జంతువుతో పోలిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే వైట్‌హౌస్ దగ్గర ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక కాల్పులు జరిపిన నిందితుడిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిందితుడిని జంతువుతో పోల్చారు. ఆ జంతువు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాల్పుల తర్వాత అదనంగా మరో 500 మంది నేషనల్ గార్డ్‌లు మోహరించాలని ట్రంప్ ఆదేశించారు.
Also Read
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ధైర్యవంతులైన గార్డులను చూసి మనమంతా హృదయ విదారకరంగా ఉన్నామన్నారు. వారు ప్రపంచంలోనే అత్యుత్తములు. అలాంటి వారిని కలిగి ఉండటం అదృష్టం. ఇలా జరగడం చాలా దారుణం’’ అంటూ ఎక్స్‌లో జేడీ వాన్స్ పేర్కొన్నారు.
అధ్యక్ష భవనం దగ్గర కాల్పులు జరగడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. సైనికుల కోసం ప్రార్థిస్తున్నామని.. వారి కుటుంబాలకు మా ప్రేమను పంచుతున్నామని ఒబామా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
నిందితుడు 29 ఏళ్ల ఆప్జన్ జాతీయుడు రహ్మానుల్లా లకాన్వాల్‌గా గుర్తించారు. 2021లో ఆప్ఘన్‌లో చోటుచేసుకున్న అస్తవ్యస్థమైన పరిస్థితుల కారణంగా అమెరికా వెళ్లిపోయినట్లుగా కనిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు వైట్‌హౌస్ లక్ష్యంగా రహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు. తొలుత ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపాడు. ఛాతీపై, తలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం రెండో గార్డుపై కాల్పులు జరిపి.. భౌతికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం మూడో గార్డ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
తొలుత ఇద్దరు సైనికులు చనిపోయారని వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మోరిస్సే ప్రకటించారు. 30 నిమిషాల తర్వాత ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం చెరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
.@SecWar: "President Trump has asked me, and I will ask @SecArmy to the National Guard, to add 500 additional troops, National Guardsman, to Washington, D.C… If criminals want to conduct things like this — violence against America's best — we will NEVER back down." pic.twitter.com/xn7hqNvCsG
— Rapid Response 47 (@RapidResponse47) November 26, 2025
Violence has no place in America. Michelle and I are praying for the servicemembers shot in Washington, DC today, and send our love to their families as they enter this holiday season under the most tragic of circumstances.
— Barack Obama (@BarackObama) November 27, 2025
We are now receiving conflicting reports about the condition of our two Guard members and will provide additional updates once we receive more complete information.
Our prayers are with these brave service members, their families, and the entire Guard community.
— Governor Patrick Morrisey (@wvgovernor) November 26, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!