Crime: 3 ఏళ్ళ బాలికపై 75 ఏళ్ళ వ్యక్తి డిజిటల్ రేప్.. చేతి వేళ్లను అందులోకి చొప్పించి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు కామాంధులకు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మూడేళ్ళ బాలికను డిజిటల్ రేప్ చేసిన 75 ఏళ్ళ వృద్దుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. 2019 లో జరిగిన ఈ ఘటనపై తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని ఒక గ్రామంలో అక్బర్ అలీ(75) అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. వారి ఇంటి పక్కనే మూడేళ్ళ బాలిక కుటుంబం నివసిస్తోంది. పొరుగు ఇల్లే కదా అని బాలిక అప్పుడప్పుడు అలీ వద్దకు వచ్చి ఆడుకొంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక రోజు ఉదయం 11 గంటల సమయంలో బాలిక అలీ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు.
ఇక కొద్దిసేపటి తరువాత బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో అతనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలికకు టెస్టులు చేయగా.. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఎక్కడా గాయాలు కాలేదని తేలింది. అంతేకాకుండా అలీ అత్యాచారం చేసినట్లు ఏ ఆధారం కనిపించలేదు. దీంతో అలీ మనవరాలు.. తమపై పగతోనే ఇదంతా చేస్తున్నారని, తన తాత అలాంటిదేమి చేయలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత బాలికను, తాత ఏం చేశాడని సున్నితంగా అడిగిన తరువాత దాన్ని డిజిటల్ రేప్ గా పరిగణిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. అసలు డిజిటల్ రేప్ అంటే ఏంటి..? అంటే.. ఇంగ్లిష్ లో డిజిట్ అంటే సంఖ్య అని అర్ధం.. అదే కాకుండా వేలు అని కూడా అర్ధం వస్తుంది. అంటే.. ఒక పురుషుడు తన ప్రైవేట్ భాగాన్ని వాడకుండా వేలితో మహిళల ప్రైవేట్ భాగం లోపలికి చొప్పించి వారిని హింసిస్తూ లైంగిక ఆనందం పొందడాన్ని డిజిటల్ రేప్ అంటారు. ఇక నిందితుడు ఈ క్రైమ్ కు పాల్పడినట్లు నిర్దారణ అవవడంతో అతనికి రూ. 50,000 జరిమానా విధించి, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు పశ్చిమ బెంగాల్ లో సంచలనంగా మారింది.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
తాజావార్తలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!