West Bengal: పశ్చిమ బెంగాల్ లో హైఅలర్ట్.. బంద్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్..!
- పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- డాక్టర్ హత్యాచార ఘటనలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసన..
- ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్ప వాయువు ప్రయోగించడం పట్ల కమలం పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో బెంగాల్ పూర్తిగా స్తంభించింది.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత కీలక శాఖలపై నేడు సీఎం సమీక్ష..
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
అయితే, పలు చోట్ల దుకాణాలను మూసి వేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. అలాగే, రైలు పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పాడింది. దీంతో బంద్ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు జారీ చేశాయి. మరోవైపు, భారతీయ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి ఇతర ప్రదేశాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలను నడుపుతున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!