చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని…
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
Ponguleti Srinivasa Reddy: నల్లగొండ జిల్లా నకిరేకల్ MPDO కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యంతో…
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం…
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు,…
CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం నేడు (మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే దిశగా చర్చలు సాగనున్నాయి. గాంధీభవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.., జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ పథకాలను వివరించేందుకు…
CLP Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్న సందర్భంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశం రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ శాసనపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక ప్రజాహిత పథకాలపై సమీక్ష జరుగనుంది. Read Also: Anna Lezhneva: అన్నదాన…
వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.