బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్‌లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.…
Madhavaram Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా మూలనపెట్టిందని, అందుకే ప్రజలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్‌లో గిరి సాగర్, రాజు సాగర్ ఆధ్వర్యంలో యువనేత మధు నాయకత్వంలో వందమంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యువకులకు గులాబీ కండువా కప్పి, పార్టీ…
అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు..
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించారు. ఈ నెల 15లోపు నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని మంత్రి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక…
Welfare Schemes: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా 561 గ్రామాల్లో నాలుగు కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు. లబ్ధిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు. Also Read: Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు ఈ…
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు గ్రామ మాజీ సర్పంచ్ బండి వెంకన్నదే బాధ్యత అని, మల్లేపల్లి గ్రామం చాలా మంచి గ్రామం అందుకే కలెక్టర్ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారని, ఖమ్మం జిల్లా అన్ని సంక్షేమ పథకాల అమలు అధికారులు బాగా చేస్తున్నారని సీఎం దగ్గర ఉందన్నారు. ఇందిరమ్మ…
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతిలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. భారతదేశానికి నేడు అత్యంత పవిత్రమైన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న రోజు అని, గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు భట్టి…
CM Revanth Reddy : చంద్రవంచ గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్కు చాలా అనుబంధం ఉంది.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.. ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చేసిన మంచి పనులను…