Bhatti Vikramarka : మాతో కలిసి నడవండి.. బహుజన శక్తిని చాటి చెప్పండి
- సంక్షేమం , సామాజిక న్యాయం.. కాంగ్రెస్ పాలనలో చారిత్రాత్మక మార్పులు
- బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ దేశానికి మార్గదర్శకాలు
- బీఆర్ఎస్-బీజేపీ కుట్రలకు ప్రజలు బలి కాదన్న భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, 56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, 8 వేల కోట్లతో యువతకు అవకాశాలు, సన్న ధాన్యంపై రూ.500 బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొస్తున్నాయి,” అని అన్నారు.
Also Read
సంక్షేమం ఒక ఎత్తైతే, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాలు మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. “ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన వంటి అంశాలను మేము పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత దశాబ్దాలుగా ఎందరో గొప్ప నాయకులు సాధించలేనివి. మన ప్రభుత్వం ధైర్యంగా, అందరితో చర్చించి, పారదర్శకంగా ఈ లక్ష్యాలను నెరవేర్చింది,” అని విక్రమార్క గర్వంగా చెప్పారు.
ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఇప్పటికే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాం. ఇది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ చేసిన గొప్ప అడుగు,” అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో భూసంస్కరణల వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందుకే దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిందని విక్రమార్క గుర్తు చేశారు. అయితే, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు గతంలో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు రుచించడం లేదని ఆయన విమర్శించారు. “ఈ నిర్ణయాలు వారి అస్తిత్వానికే సవాల్ విసురుతాయి. అందుకే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాయి,” అని ఆయన ఆరోపించారు.
కంచ గచ్చిబౌలి వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అసత్య ప్రచారం చేస్తున్నాయి. వారు ఏనుగులు, పులులు తిరుగుతున్నాయని చెప్పినా, ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారు,” అని వ్యాఖ్యానించారు.
చివరగా, బహుజన వర్గాలను చైతన్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “బీసీ కుల సర్వే మీ కోసం, మీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసింది. మాతో కలిసి నడవండి, బహుజన శక్తిని చాటి చెప్పండి,” అని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!