రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని.. ఇప్పటి వరకు ఐదు లక్షల
అప్లికేషన్లు మాత్రమే తమకు వచ్చినట్లు చెప్పారు.
READ MORE: IND vs ENG: భారత్‌తో మ్యాచ్‌లు.. ఇంగ్లండ్ జట్టులోకి ఆడి కొడుకొచ్చేశాడు!
అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని.. కుటుంబ విభజన (Splitting) కోసం 44వేల మంది దరఖాస్తు చేశారని చెప్పారు. ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది దరఖాస్తులు పెట్టున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశామని వెల్లడించారు. సాంకేతికపరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలను క్షమాపణ కోరారు. ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.. ప్రజలు తొందరపడకండన్నారు. కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తామని చెప్పారు.
READ MORE: Himanta Biswa Sarma: మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..
రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్ గ్రేడ్ అయిపోతుందని.. ప్రజలు ఎక్కడకీ వెళ్లకూడదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదని.. పెళ్లి సంబంధించి ఫొటో కూడా అక్కర్లేదని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసింది.. ఇక అలా చేయకండని చెప్పారు. కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించండని.. ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలన్నారు. డిలీషన్ అనేది.. డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామని.. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారికి కూడా డిలీషన్ ఆప్షన్ ఇస్తున్నామని చెప్పారు. మహిళలు, స్త్రీలుతో పాటు, ట్రాన్స్ జండర్స్ కు కూడా అవకాశం కల్పించామని.. కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామన్నారు.
READ MORE: DK Aruna : ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి శ్రేణిలో భాగమే
“క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాం. రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు. కొంతమంది ఆకార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు.. అది ఇప్పుడే సాధ్యం కాదు. వారంరోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే దీనిని సరి చేసి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈకెవైసీ, ఆధార్ సీడింగ్ లో మార్పులు, రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సప్ ద్వారా చేసుకునేలా ఎనెబుల్ చేశాం. కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదు.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నాం.” అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.