హైదరాబాద్ నగరంలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ దశాబ్దంలోనే డిసెంబర్ నెలకు సంబంధించి అత్యంత చలి రోజుగా 18వ తేదీ (శనివారం) రికార్డు సృష్టించింది. శనివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.2 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలో డిసెంబర్ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని.. ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉందని తెలిపారు.
Read Also: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు
మరోవైపు వచ్చే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.