కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు…
వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. మంగళవారం కొండచరియలు విరిగిపడి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. అనంతరం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చేపట్టిన సహాయ చర్యలు భారతీయుల్ని కట్టిపడేస్తున్నాయి.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది.
Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. శిథిలాల కింద, కూలిన ఇళ్ల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం రెస్క్యూ బృందాలు డీప్ సెర్చ్ రాడార్ ను ఉపయోగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి డీప్ సెర్చ్ రాడార్‌ను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. నార్తర్న్ కమాండ్ నుండి ఒక జావర్ రాడార్, ఢిల్లీలోని త్రిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుండి నాలుగు రీకో రాడార్ లను…
Wayanad landslides: 344కి చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం సెర్చ్..ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా కూడా విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది
Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది.
కేరళలోని వాయనాడ్‌లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. గురువారం ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కలియ తిరిగారు.
Wayanad Landslide: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు.