రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
Nipah virus: గత నెలలో కేరళ రాష్ట్రాన్ని మరోసారి ‘నిపా వైరస్’ వణించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారు. అయితే కేరళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మిగిలిన వారికి ప్రాణాపాయం లేకుండా రక్షించగలిగింది. ఇదిలా ఉంటే తాజాగా నిపా వైరస్ గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిపా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె బుధవారం తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్…
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీప్ వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్‌హాల్ గ్రామ పంచాయతీలో లోయలో పడింది. ఈ ఘటనలో జీప్‌లో ఉన్న తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన.
Kerala: మటన్ తక్కువగా వడ్డీస్తున్నారని చెబుతూ ఏకంగా ఓ ఖైదీ జైలు అధికారులపైనే దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. తనకు వడ్డించిన మటన్ కర్రీతో సంతృప్తి చెందకపోవడంతో వయనాడ్ కు చెందిన ఖైదీ ఫైజాస్ పూజపురా సెంట్రల్ జైలులో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇతడిని ప్రస్తుతం జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉంచారు.
సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అనే అంశం చర్చకు వచ్చింది.