వయనాడ్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీతో తలపడేది ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కమలనాథులు కూడా సమఉజ్జినే రంగంలోకి దింపింది. వాయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ రంగంలోకి దింపింది. శనివారం సాయంత్రం ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది.
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
వయనాడ్లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
ఇటీవలే కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన వయనాడ్‌లో పంది మాంసం తినే ఛాలెంజ్‌పై తీవ్ర రచ్చ నెలకొంది. సహాయక చర్యల కోసం డబ్బు సేకరించేందుకు ప్రారంభించిన ఈ ప్రచారంపై ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) పోర్క్ ఛాలెంజ్‌పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇది ఏ మత సమాజాన్ని కించపరిచేలా చేయలేదని పేర్కొంది.
ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Wayanad Helping : ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిన పడిన ప్రమాదం యావత్ దేశాన్నే కలిచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 390 మందికి పైగా మృతి చెందగా మరో 200 మందికి గాయాలయ్యాయి.
PM Modi on Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.
PM Modi: ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతం , కొండచరియలు విరిగిపడిన సంఘటనతో మృతుల దిబ్బగా మారింది. ఈ ప్రమాదంలో 400కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయక పునారావాస చర్యల్ని సమీక్షించేందుకు పీఎం వయనాడ్ వెళ్తున్నారు.
కేరళలోని వయనాడ్లో జరిగిన విపత్తు తర్వాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవ్వరూ మరిచిపోవడం లేదు. ప్రాణాలను తెగించి సహాయ చర్యలు పాల్గొన్నారు. అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.