Brain Infection: కేరళను అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’ భయపెడుతోంది. ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’గా పిలిచే ‘‘మెదడును తినే అమీబా’’ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు ఈ అరుదైన వ్యాధికి బలైనట్లు ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆగస్టు నాటికి 3కు చేరింది.
Smart TV explode: స్మార్ట్ టీవీ పేలిపోవడం వల్ల ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగింది. బుధవారం ఉదయం 10 కల్పేటలోని అంబిలేరి ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడు సజిత్ తన తమ్ముడు ఇమ్మాన్యుయేల్‌తో కలిసి టీవీ చూస్తుండగా ఈ ఘటన జరిగింది.
Priyanka Gandhi: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు త్రిస్సూర్ జిల్లాలో ఒక యూట్యూబర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఈరోజు (మార్చ్ 31) తెలిపారు.
అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే…
వయనాడ్ ప్రజల కోసం తన ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఎంపీగా గెలిచిన సందర్భంగా వయనాడ్‌లో ప్రియాంక కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ గురువారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేరళీయులు ఇష్టపడే కసువ చీర ధరించి ఆమె లోక్‌సభలోకి ప్రవేశించారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.