Wayanad landslides: వయనాడ్ ప్రకటన.. అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- వయనాడ్ ఘటనపై తప్పుడు ప్రకటన చేశారన్న జైరాం రమేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది. కేరళ ఈ హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని షా అన్నారు. అయితే, ఈ వాదనల్ని ప్రివిలేజ్ నోటీసుల్లో జైరాం రమేష్ తోసిపుచ్చారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన రాజ్యసభను తప్పుదోవ పట్టించిందని స్పష్టమైంది, అవి అబద్ధమని నిరూపించబడ్డాయని నోటీసులో పేర్కొన్నారు. సభ్యుడు లేదా మంత్రి సభను తప్పుదారి పట్టించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఇది సభను ధిక్కరించడమే అని ప్రివిలేజ్ నోటీసుల్లో పేర్కొంది.
జూలై 31 బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళని హెచ్చరించినట్లు అమిత్ షా చెప్పారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
-
RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!