PM Modi: ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతం , కొండచరియలు విరిగిపడిన సంఘటనతో మృతుల దిబ్బగా మారింది. ఈ ప్రమాదంలో 400కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయక పునారావాస చర్యల్ని సమీక్షించేందుకు పీఎం వయనాడ్ వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మోడీ కన్నూర్ చేరుకోనున్నారు. కొండచరియాలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శిస్తారు. రెస్క్యూ ఫోర్స్ ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను ప్రధానికి వివరిస్తారు. ప్రధాన మంత్రి సహాయ శిబిరం మరియు ఆసుపత్రిని కూడా సందర్శిస్తారు, అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలుసుకుంటారు మరియు వారితో సంభాషిస్తారు.
Read Also: Double iSmart: ఇక వెనక్కి తగ్గేది లేదమ్మా.. డబుల్ డోస్ గ్యారెంటీ!
జూలై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో వైత్తిరి తాలూకాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. దాదాపుగా 13 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ మైదానాలకు సమానంగా ఉన్న కొండచరియాలు ఇరువజింఘి నదిలోకి జారీపడ్డాయి. దీంతో నదీ సమీపంలో ఉన్న ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బురద, రాళ్లతో కూడిన నదీ ప్రవాహం ఊళ్లపై విరుచుకుపడింది. దీంతో పెను ప్రమాదం సంభవించింది.