Wayanad: వయనాడ్‌లో ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్.. పేరు ప్రకటించిన బీజేపీ
- వయనాడ్‌లో ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్
- నవ్య పేరు ప్రకటించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీతో తలపడేది ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కమలనాథులు కూడా సమఉజ్జినే రంగంలోకి దింపారు. వాయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ రంగంలోకి దింపింది. శనివారం సాయంత్రం ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
నవ్య హరిదాస్.. బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. నవ్య.. హెచ్‌ఎస్‌బీసీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేశారు. అయితే ప్రజా సేవ చేసేందుకు ఆమె ఉద్యోగాన్ని వదులుకుని బీజేపీ పార్టీలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండో సారి బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. కార్పొరేషన్‌లో బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఒక కౌన్సిలర్‌ను ప్రియాంకపై బీజేపీ పోటీకి దింపింది.
Also Read
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల భారీ విజయంతో గెలుపొందారు. దీంతో రాయ్‌బరేలీలో కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ బైపోల్ ఎన్నిక వచ్చింది. వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేస్తారని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. అన్నట్టుగానే ఆమె పేరును ప్రకటించింది. ఇక అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుంది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు. పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాయనాడ్ కలెక్టరేట్‌కు రోడ్‌షో ద్వారా వెళ్లి ప్రియాంక నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక వయనాడ్ ఎన్నికల ఫలితం నవంబర్ 23న విడుదల కానుంది.
BJP fields Navya Haridas for the Lok Sabha by-elections from Wayanad where she will face Congress' Priyanka Gandhi Vadra.
Party also releases list of candidates for Assembly by-elections from Assam, Bihar, Chhattisgarh, Karnataka, Kerala, Madhya Pradesh, Rajasthan and West… pic.twitter.com/rVCRDNZLMt
— ANI (@ANI) October 19, 2024
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!