Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు కే. సుధాకరన్, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి సహా ప్రముఖ నేతలు పాల్గొంటారు.
అయితే, అక్టోబర్ 25 నాటికి అన్ని పంచాయతీ ఎన్నికల కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు భావిస్తున్నారు. అగ్ర నేతల నేతృత్వంలో ఈ నెల 26, 27 తేదీల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే, నియోజకవర్గ ఎన్నికల కమిటీలను సైతం ఏర్పాటు చేయనున్నారు. సుల్తాన్ బతేరి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకుడు డీన్ కురియాకోస్ నేతృత్వంలో పంచాయతీ సమావేశాలు కంప్లీట్ అయింది. రానున్న రోజుల్లో కల్‌పేటలో ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్ నేతృత్వంలో మనంతవాడి పంచాయతీలో కమిటీలు వేసేందుకు సమావేశం కానున్నారు.
Read Also: Bomb Threat: మరోసారి ఢిల్లీ-లండన్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
ఇక, రాహుల్ గాంధీకి మద్దతు పలికిన వయనాడ్ ప్రజలు మరోసారి ప్రియాంక గాంధీకి చారిత్రాత్మక మెజారిటీ ఇవ్వడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక, భారత ఎన్నికల సంఘం ఇటీవల 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.