Priyanka Gandhi: నవంబర్ 13న వయనాడ్ బైపోల్.. ప్రియాంకాగాంధీ పేరు ప్రకటన
- నవంబర్ 13న వయనాడ్ బైపోల్స్
- బరిలోకి దిగుతున్న ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
ఇది కూడా చదవండి: Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్‌లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును ప్రకటించారు. ఆమెతో పాటు కేరళలోని మరో రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థులను వెల్లడించింది. చెలక్కర, పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు రమ్య హరిదాస్ మరియు రాహుల్ మమ్‌కూటతిల్ పోటీ చేయనున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. దీంతో వయవాడ్ బైపోల్‌కు మంగళవారం ఈసీ షెడ్యూల్ వెల్లడించారు. నవంబర్ 13న పోలింగ్ జరగగా.. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతోందా..?
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా మంగళవారం ఎన్నికల సంఘం ఉపఎన్నికలు ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్‌లో రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!