Elon Musk: అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు.
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో జరిగిన కవాతులో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా కనీసం 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.…
హవాయి దీవులను పూర్తిగా దహించి వేసిన కార్చిచ్చు.. వేగంగా వాషింగ్టన్ వైపు కదులుతోంది. వేగంగా వీస్లున్న బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు కూడా అంతే వేగంతో వ్యాపిస్తోంది.
ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌లో తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల జీతాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాక్ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మేందుకు పెట్టిన ఎంబసీ కార్యాలయం 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది.
అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది.
Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.
అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి.