Elon Musk: అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు. ఓ రహస్య ప్రదేశంలో గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఇరాన్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు ప్రకటించాయి. ఈ సమావేశంలో ఇరాన్ రాయబారి టెహ్రాన్‌లో వ్యాపార లావాదేవీలను ప్రారంభించాలని కోరుతూ అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎలాన్ మస్క్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఈ పరిణామం యుఎస్ రాజకీయాల్లో మస్క్ కు యొక్క ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అయితే, ఇరాన్‌తో 2015 అణు ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ వైదొలిగారు. ఇరాన్ చమురు ఎగుమతులను నియంత్రించే చర్యలతో సహా గరిష్ట ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ, ఇరాన్‌కు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు నిర్వహించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు బలమైన మద్దతునిచ్చారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్!
అయితే, డొనాల్డ్ ట్రంప్ యొక్క పరివర్తన బృందం లేదా ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ మిషన్ ఈ సమావేశాన్ని మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలని ట్రంప్‌కు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే మస్క్, ఇరాన్ రాయబారితో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ అంశాన్ని రిపబ్లికన్ పార్టీతో పాటు ఇజ్రాయెల్‌లోని సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.