Bill Clinton: అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్..
- మరోసారి అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్..
- తీవ్ర జ్వరంతో వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రెసిడెంట్..
- ప్రస్తుతం బిల్ క్లింటన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: యూఎస్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Clinton: అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అస్వస్థతకు గురి కావడంతో వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే, తీవ్ర జ్వరంతో బిల్ క్లింటన్ బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పుకొచ్చారు. తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వెల్లడించారు. క్రిస్మస్ నాటికి మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Allu Arjun : నేడు పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండు సార్లు (1993-2001) పని చేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2004లో తీవ్రమైన ఛాతీ నొప్పితో పాటు శ్వాసకోస సమస్యలు రావడంతో 4 సార్లు బైపాస్ సర్జరీ కూడా చేశారు వైద్యులు. ఆ తర్వాత ఏడాది ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి హస్పటల్ లో జాయిన్ అయ్యారు. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి ట్రీట్మెంట్ చేసి రెండు స్టంట్లు వేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బిల్ క్లింటన్ పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు శస్త్ర చికిత్స తీసుకోగా.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల తరఫున బిల్ క్లింటన్ చురుకుగా ప్రచారం చేశారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!