Vivek Taneja: వాషింగ్టన్‌లో దాడి.. మృతిచెందిన భారత సంతతి వ్యాపారవేత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.
వివేక్ తనేజా (41) ‘డైనమో టెక్నాలజీస్’ సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తోంది. వర్జీనియాలో నివాసముంటున్న వివేక్.. ఫిబ్రవరి 2న ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చాడు. వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తితో వివేక్‌కు గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దది కాగా.. దుండగుడు వివేక్‌పై దాడి చేశాడు. ఆపై వివేక్‌ను కిందపడేసి నెలకు కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వివేక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాం: బీసీసీఐ
వివేక్ తనేజా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసి.. ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. తాజాగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై గుర్తు తెలియని దుండగులు చికాగోలో దాడి చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో ఉంటున్న ఐదుగురు భారతీయ విద్యార్థులు పలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!