Washington: కారులో కూర్చొని బర్గర్ తింటున్న వ్యక్తిపై పోలీస్ కాల్పులు జరిపాడు. అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న ఓ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్. ఎరిక్ కంటూ అనే 17 ఏళ్ల యువకుడు అందులో బర్గర్లను కొనుగోలు చేశాడు. పార్కింగ్ లాట్ లో ఉన్న తన కారులో కూర్చుని తింటున్నాడు. ఇంతలో జేమ్స్ బ్రెనాండ్ అనే పోలీసు అధికారి వచ్చాడు. కారు డోర్ తీసి కిందికి యువకుడిని దిగాలన్నాడు. ఎందుకు అని అడిగితే రివాల్వర్ తీసి గురిపెట్టాడు. అది…
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే…
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్‌లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది.…