వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సర్జరీలు నిలిచిపోయాయి. ఏసీలు పనిచేయకపోవడంతో వైద్యులు సర్జరీలను నిలిపివేశారు. వారం రోజుల నుంచి ఆసుపత్రి లో సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేఎంసి సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజు 10 నుంచి 15 సర్జరీలు జరుగుతుంటాయి. సర్జరీలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
సర్జరీలు నిర్వహించాల్సిన పేషంట్లను వైద్యులు ఆన్ లీవ్ పై శనివారం ఇంటికి పంపించారు. ఉమ్మడి జిల్లాలో నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు అసహనంతో వెనుతిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సెంట్రల్ ఏసీల మరమ్మత్తులు వెంటనే చేపించాలని రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సర్జరీలో ఆగిపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాల్సిన వస్తోందంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.